
నియోజకవర్గానికి 2వేల మంది
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే బహిరంగ సభకు భారీ జన సమీకరణకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు వేలకు తగ్గకుండా కార్యకర్తలను సమీకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్‌కు శివారులో ఉన్నందున ఇక్కడి నుంచి వీలైనంత ఎక్కువ మంది తరలించాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఈ మేరకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశంతో పాటు జిల్లా నాయకులు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల తరలింపుపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సొంత వాహనాలతో పాటు, ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేశారు.
సభను విజయవంతం చేయాలి :
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తుర్కపల్లి: ఖర్గే బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు.గురువారం తుర్కపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుతున్నామని చెప్పారు. జైబాపు.. జైబీమ్.. జైసంవిదాన్ అనే నినాదంతో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న మహాసభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య, నాయకులు దనావత్ శంకర్‌నాయక్, చాడ భాస్కర్‌రెడ్డి, మోహన్‌బాబు, ఐలయ్య, రాజారాంనాయక్, వెంకటేష్, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ నేడు హైదరాబాద్‌లో ఖర్గే బహిరంగ సభ
ఫ జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి