
యాదగిరీశుడి సేవలో అడ్లూరి..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. మంగళవారం రాత్రే మంత్రి యాదగిరిగుట్టకు చేరుకుని కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లో బస చేశారు.
మంత్రికి ఘన స్వాగతం..
మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో కొండ పైన ఘన స్వాగతం పలికారు. వారి వెంట వెంట డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ చైతన్యరెడ్డి, నాయకులు బాలరాజుగౌడ్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ముక్కెర్ల మల్లేశం, బందారపు భిక్షపతి తదితరులున్నారు.