
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని.. భవిష్యత్‌లో మరిన్ని నిధులు తెస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎస్‌డీఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో చేపట్టిన అదనపు బ్లాక్ నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
ప్రగతిపై కలెక్టర్ల వివరణ
సమావేశంలో ముందుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు.. ఆయా జిల్లాలో నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాల్లో ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు.

నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి