
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు
భువనగిరి : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం భవనగిరి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా అప్రొఫ్రియేట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లింగ నిర్థారణకు పాల్పడితే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 8074261809 ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముందుగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేట్ కట్ చేసి వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో జిల్లా సెషన్స్ జడ్జి జయరాజు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఏడీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌ఓ మనోహార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సాయి శోభ, ప్రమీల, డెమో అంజయ్య, వసంతకుమారి పాల్గొన్నారు.