
అధునాతన సేవలపై ప్రజలకు తెలియజేయాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందజేస్తున్న అధునాతన వైద్యసేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మెడికల్ కళాశాల మానిటరింగ్ కమిటీ సభ్యులు డీఎంఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, భువనగిరి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీఎహెచ్‌ఎస్ చిన్ననాయక్‌తో కలిసి సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాలు, బ్లడ్ బ్యాంకు, నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోగులకు అందజేస్తున్న వైద్య సేవలు, ఇతర అంశాలపై సమీక్షించారు. మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మెడికల్ కళాశాలలో అవసరమైన వసతులు ఉండాలని, భోదన, భోదనేతర సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఖాళీల వివరాలు తెలియజేయాలని సూచించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు