హైవేలో డీజిల్ దందా
అక్రమ డీజిల్ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం శివారు హైవే ప్రాంతం నిలయంగా మారింది. 2లో u
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా కృషి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా పట్టణంలో ట్రాఫిక్ అవరోధాలు, రోడ్ల అక్రమణ, పార్కింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు బాధ్యతలు విధిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, విద్యార్థులు ట్రాఫిక్ విషయంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లతో సమావేశాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల బస్సులన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ అవరోధం ఎక్కువగా ఉంటుందని యాజమాన్యాలతో సమావేశమై స్కూల్ బస్సులు రూట్ ప్లాన్ తయారుచేసి అమలు చేయాలని సూచించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ గట్టిగా పాటించాలని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ వి.భీమారావు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, రవాణా అధికారి కృష్ణారావు, ఆర్టీసీ ఆర్‌ఎం ఎన్.వి.ఆర్ వరప్రసాద్, టౌన్ సీఐలు ఎం.నాగరాజు, జి.కాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.


