వ్యాయామ ఉపాధ్యాయులను కోచ్‌లుగా నియమిస్తాం
ఏలూరు రూరల్: ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమితులైన క్రీడాకారుల సేవలను ఉపయోగించుకుంటామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. మంగళవారం ఆయన అల్లూరి సీతారామరాజు స్టేడియం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యాయామ ఉపాద్యాయులను డిప్యూటేషన్‌పై స్టేడియంలో తాత్కాలిక కోచ్‌లుగా నియమించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. 2026లో రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటుచేసి క్రీడాకారులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసి గ్రామీణ బాలబాలికలకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


