ప్రమాదవశాత్తూ పురుగు మందు తాగి..
పెదవేగి: మంచినీళ్లు అనుకొని పురుగు మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మేడికొండ పవన్‌కుమార్ (32) గత నవంబర్ 27న పొలంలో మందు కొట్టే ప్రక్రియలో మంచినీరు అనుకొని ప్రమాదవశాత్తు పురుగుల మందు తాగేశాడు. విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం గుడివాడ తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 1న పవన్ మృతిచెందాడు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పవన్ తండ్రి వెంకటకృష్ణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


