ముంచెత్తిన నీరు
అజ్జమూరు చానల్ నుండి నీరు కాలువలోకి చొచ్చుకురావడంతో సమీపంలోని పంట పొలాల్లోకి నీరు భారీగా చేరుకుంది. ఇంతరకూ వరి చేలను ఎండగట్టి కోతలకు సిద్ధం చేసుకున్నాం. చానల్ నీటితో వరి మొక్కలు నేలకొరిగే ప్రమాదం ఏర్పడింది. గింజ రాలిపోయే ప్రమాదం ఉంది.
– కొల్ల రమేష్, కుప్పనపూడి,
ఆకివీడు మండలం
మండలంలో నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, నీటి సంఘాల నిర్లక్ష్యం తీవ్రంగా ఉంది. ఏడీఏ కార్యాలయం మార్చిన తరువాత ఆయన ఆచూకీ లేదు. వ్యవసాయశాఖ ఇతర అధికారులు, ఆర్‌ఎస్కేల పరిస్థితి అంతే. అజ్జమూరు చానల్ తూరను ఎందుకు తీశారని ప్రశ్నిస్తే శివారు ప్రాంతాల చెరువులకు నీరందాలని చెబుతున్నారు.
–నంద్యాల చల్లారావు, కుప్పనపూడి, ఆకివీడు మండలం
ముంచెత్తిన నీరు


