
● మా గోడు పట్టదా?
తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా వాటర్‌వర్క్స్, వీధి దీపాల నిర్వహణ వంటి అత్యవసర సర్వీస్‌లను బహిష్కరించడంతో ప్రభావం సమ్మె ప్రభావం కనిపిస్తోంది. నరసాపురం పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం తణుకులో నిరాహారదీక్ష శిబిరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేతన సవరణ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలన్నారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ కార్మికులు నిరసన కొనసాగించారు.
పాలకొల్లు సెంట్రల్/
నరసాపురం/తణుకు అర్బన్/
తాడేపల్లిగూడెం(టీఓసీ)

● మా గోడు పట్టదా?

● మా గోడు పట్టదా?

● మా గోడు పట్టదా?