కూలికి వెళ్తూ చదివించారు | - | Sakshi
Sakshi News home page

కూలికి వెళ్తూ చదివించారు

Jul 2 2025 7:20 AM | Updated on Jul 2 2025 7:20 AM

కూలిక

కూలికి వెళ్తూ చదివించారు

మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. మా ఊరిలోని ఏపీ మోడల్‌ స్కూల్లో పదో తరగతి చదివా. 591 మార్కులు రావడంతో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు లభించింది. మా నాన్న కొండయ్య కూలి పనులకు వెళుతూ నన్ను చదివించారు. ట్రిపుల్‌ ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా ఉంది.

– బొప్పరాజు సాత్విక,

మార్కాపురం, ప్రకాశం జిల్లా

నా కల నెరవేరింది

మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్‌లో చదువుకుని పదో తరగతిలో 580 మార్కులు సాధించా. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివించింది. ట్రిపుల్‌ ఐటీలో చేరాలనే నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది.

– సాల్వ హిమచంద్రిక,

గొట్టిపడియ, ప్రకాశం జిల్లా

కష్టపడి చదువుతా

మా నాన్న ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ కూలి పనులకు వెళ్తుంది. నేను జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్‌లో పదో తరగతి చదివి 592 మార్కులు సాధించా. ఇక్కడ సీటు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా కష్టపడి చదువుతా.

– వాసిరెడ్డి వెంకటలక్ష్మి,

పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా

ఉన్నత స్థానమే లక్ష్యంగా..

అమ్మ, నాన్న ఇద్దరూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతిలో 590 మార్కులు సాధించా. తల్లిదండ్రుల కష్టాన్ని రోజూ చూస్తుండేవాడిని. ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించినందుకు ఆనందంగా ఉంది. బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగడమే లక్ష్యం.

– దామా చైతన్య, నలదలపూర్‌,

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

సంతోషంగా ఉంది

నా తండ్రి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీఎంఆర్‌ బాలికల హైస్కూల్‌లో చదివి పదో తరగతిలో 587 మార్కులు సాధించాను. నూజి వీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడం సంతోషంగా ఉంది. ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులను ఆనందంగా ఉండేలా చూడటం నా బాధ్యత.

– మరుకుర్తి శ్రీకీర్తన,

పిఠాపురం, కాకినాడ జిల్లా

ఉన్నత విద్యకు అవకాశం

మా నాన్న కూలికి వెళ్తేనే మా కుటుంబం గడిచేది. నేను కావలి మున్సిపల్‌ హైస్కూల్‌లో చదివి పదో తరగతిలో 582 మార్కులు సాధించాను. ఇక్కడ సీటు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి చెందిన నాకు ఉన్నత చదువుకు అవకాశం రావడం సంతోషంగా ఉంది.

– బొగ్గవరపు తనూజ,

లింగనపాలెం, నెల్లూరు జిల్లా

కూలికి వెళ్తూ చదివించారు 
1
1/5

కూలికి వెళ్తూ చదివించారు

కూలికి వెళ్తూ చదివించారు 
2
2/5

కూలికి వెళ్తూ చదివించారు

కూలికి వెళ్తూ చదివించారు 
3
3/5

కూలికి వెళ్తూ చదివించారు

కూలికి వెళ్తూ చదివించారు 
4
4/5

కూలికి వెళ్తూ చదివించారు

కూలికి వెళ్తూ చదివించారు 
5
5/5

కూలికి వెళ్తూ చదివించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement