
ఆనందం ‘ట్రిపుల్’
నూజివీడు: రోజువారీ కూలీ కుమారుడు ఒకరు... ఆటో డ్రైవర్ కొడుకు మరొకరు.. తండ్రి లేని నిరుపేద బాలిక ఇంకొకరు.. ఇలా అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే. అద్భుత ప్రతిభ కలిగిన వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో సత్తా చాటారు. గ్రామీణ పేద పిల్లలకు సైతం సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందారు. తమ లక్ష్యానికి అనుగుణంగా తొలి అడుగు పడిందనే ఆనందంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు పొందిన కొందరు విద్యార్థుల మనోగతం వారి మాటల్లోనే..
నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన గ్రామీణ పేద విద్యార్థులు
కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని సంతోషం