తణుకు అర్బన్: ‘రోడ్లపై తాండవిస్తున్న అపారిశుద్ధ్యం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సజ్జాపురంలో డ్రెయినేజీల్లోంచి తీసిన పూడికను పదిరోజులైనా తొలగించడం లేదని, ఇంటి ముందు మురుగు గుట్టలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఉదయం మినీ జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో మురుగు గుట్టలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
సిల్ట్ తొలగింపు
పాలకొల్లు సెంట్రల్: ‘ప్రమాదకరంగా ఏఎంసీ ప్రహరీ’ శీర్షికన ఈనెల 5న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సోమవారం అధికారులు స్పందించారు. శానిటరీ వర్కర్లు ఏఎంసీ ప్రహరీ గోడకు కర్రలు అడ్డుపెట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో సిల్ట్‌ను తొలగించారు. మార్కెట్ యార్డు ప్రధాన రహదారిలో ఉన్న సిల్ట్‌ను తొలగిస్తున్నారు. కమిషనర్ బి.విజయసారథి పర్యవేక్షిస్తున్నారు. అ యితే మార్కెటింగ్ యార్డు అధికారులు మాత్రం ప్రహరీ తొలగింపునకు ప్రయత్నం చేయడం లేదు.
● పారిశుద్ధ్య చర్యలు
● పారిశుద్ధ్య చర్యలు