పోరుకు పల్లెలు సిద్ధం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హనుమకొండ అర్బన్: జిల్లాలోని 210 గ్రామపంచాయతీలు, 1,986 వార్డు సభ్యుల ఎన్నిలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పంచాయతీ పోరుకు పల్లెలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. కొన్నిచోట్ల రిజర్వేషన్ల కారణంగా అభ్యర్థులు దొరకలేదు. దొరికిన అభ్యర్థులు తమ పార్టీ వారు కాకపోవడంతో అవస్థలు పడిన నాయకులు ఎట్టకేలకు అవగాహనకు వచ్చారు. మొత్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో తమ అభ్యర్థులను నిలబెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విజయవంతం అయ్యాయి.
3,70,871 ఓటర్లు..
జిల్లాలో 12 మండలాల పరిధిలో గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,70,871 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,80,666 మంది పురుష ఓటర్లు, 1,90,201 మహిళా ఓటర్లు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మూడు విడతలు కలిపి మొత్తం 1,986 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంది. అదనంగా 396 బ్యాలెట్ బాక్సులతో కలిపి మొత్తం 2,382 బాక్సులు సిద్ధం చేశారు. వీటిని ఇప్పటికే స్థానిక పోలింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. సర్పంచ్ ఎన్నికల కోసం 3,39,0000 వార్డు సభ్యుల కోసం 4,0,5,000 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. సర్పంచ్‌కు పింక్ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు పేపర్లను కేటాయించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు ఉండవు. వారి క్రమసంఖ్య, గుర్తు మాత్రమే ఉంటాయి.
586 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్..
జిల్లాలో 586 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్,66 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ అధికారులు నియామకం..
1,480 పోలింగ్ అధికారులు, 1,891 అదర్ పోలింగ్ పర్సన్‌్స్‌ను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపా రు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రస్థాయి నుంచి వచ్చే ఆదేశాలను గ్రామస్థాయికి చేరవేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
సర్పంచ్ స్థానాలకు 56,
వార్డు సభ్యులకు 85 నామినేషన్లు
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం అధికారులు నామినేషన్లను స్వీకరించారు. ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల పరిఽధి లోని మొత్తం 68 గ్రామ పంచాయతీ స్థానాలు, 634 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 56, వార్డుస్థానాలకు 85 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మరో రెండు రోజులు నామినేషన్ల స్వీకరించనున్నట్లు వివరించారు. రెండో విడతలోని 73 పంచా యతీలకు మొత్తంగా 524 నామినేషన్లు, 694 వార్డులకు 1,838 నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిని స్క్రూటినీ చేయాల్సి ఉంది.
కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన
జిల్లా అధికార యంత్రాంగం
పోరుకు పల్లెలు సిద్ధం


