వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్) ఆర్‌ఎంఓగా డాక్టర్ అన్నెపాక మంజులను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జిల్లా దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతిపై జీఎంహెచ్ ఆర్‌ఎంఓగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఖిలా వరంగల్: ఫిర్యాదుదారులతో గౌరవంగా మెదులుతూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. ఈ మేరకు బుధవారం వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సన్నిహిత సెంటర్ (హాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, ఏఎస్పీ శుభం ప్రకాశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వివిధ పనులపై వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, రౌడీషీటర్లు, ఆకతాయిలు ఆగడాలను అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ సీపీ సందర్శించారు. సిబ్బంది వివరాలు, పెండింగ్ కేసులను ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. అంతకు ముందుగా పోలీస్ సిబ్బంది ఆయనను స్వాగతిస్తూ గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎసైలు సుమన్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168


