‘గుర్తింపు’ లేక ఇబ్బందులు
వరంగల్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు, పింఛన్‌దారులకు ఐడీ (ఎంప్లాయ్‌కోడ్)లు లేక రెండు నెలలుగా వేతనాలు, పెన్షన్లు రావట్లేదు. కాగా, ఇప్పటి వరకు ప్రతీ నెల చెక్కులను ఫైనాన్స్‌శాఖకు పంపిస్తే నిధులు విడుదలయ్యేవి. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిబంధనలు మార్చడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బినామీ పేర్లతో పలు డిపార్ట్‌మెంట్లలో వేతనాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 010 పద్దు కింద ఉన్న ఉద్యోగులకు, పింఛన్‌దారులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ప్రతీ ఉద్యోగి నుంచి గుర్తింపు పత్రాలు సేకరించింది. ఈపద్దు కింద ఉన్న ఉద్యోగులకు వేతనాలు, పింఛన్‌దారులకు ఐడీ (గుర్తింపు నంబర్) ఉంటుంది.
బిల్లులు ఎలా?
మార్కెట్ కమిటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఫించన్‌దారులకు ఐడీలు లేని కారణంగా బిల్లులు చేయలేని పరిస్థితుల్లో మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈవిషయంపై మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు సమస్య వివరించడంతో మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు మాత్రమే యూనిక్ ఐడీలను ఇచ్చింది. వీటిని హైదరాబాద్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. అందుకని ఉద్యోగులకు మాత్రమే నెట్ అమౌంట్ రూపంలో కేటాయింపులు జరిగినట్లు సమాచారం. కాగా, వెంటనే ఐడీలు ఇచ్చి వేతనాలు, పింఛన్లను మంజూరు చేయాలని ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయ్‌స్, ఫించన్‌దారులు విజ్ఞప్తి చేస్తున్నారు
ఐడీలు లేని మార్కెట్ ఉద్యోగులు,
పింఛన్‌దారులు
రెండు నెలలుగా పింఛన్లు,
వేతనాల నిలిపివేత


