సేవ కోసం సమయం కేటాయించాలి..
సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఆయన ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని, వారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, ఆర్‌ఐ సతీశ్, స్పర్జన్‌తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ సిబ్బం పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: వరంగల్ 46వ డివిజన్ పరిధి రాంపూర్‌లోని డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్ లెగెస్సీ వేస్ట్ ప్రాసెసింగ్ వర్క్ తోడ్పడుతుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. రాంపూర్‌లోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రాజెక్టును మంగళవారం మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.


