సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
● సీపీ సన్‌ప్రీత్‌సింగ్
ఖానాపురం: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు ఖానాపురం మండలంలోని వేపచెట్టుతండా వద్ద ఏర్పాటు చేసిన వరంగల్–మహబూబాబాద్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని మూడు జిల్లాల సరిహద్దుల పరిధిలో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేపడుతున్నామన్నారు. నిత్యం ఇంటలిజెన్స్ టీంలు నిఘా పెడుతున్నాయని, అక్రమ మద్యం, గుడుంబాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఘటనలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలన్నారు. అనుమతి కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ అంకిత్‌కుమార్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


