మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?
రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ
పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేసిన ఒక రాతి పిల్లర్
గోవిందరాజు గద్దైపె ఇంకా ఏర్పాటు చేయని పిల్లర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీ(గురువారం)న పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్కలు గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిల్లర్ల ఏర్పాటు పనులన్నీ ఈనెల 3 వతేదీ కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిగిలింది ఒకరోజే..
గోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిగిలింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్ల ర్‌ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేయడం కనిపించింది. రెండు గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటుతోపాటు డిజైన్‌కు సంబంధించిన స్టోన్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు పరిశీలించినా
పనులు అంతంతే..
ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంపై ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిల్లర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.
ముహూర్తం ఖరారు చేసిన పూజారులు
మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమే
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?


