మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
● డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఖానాపురం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు సూచించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి వైద్యులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ప్రతీ మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. నిత్యం వైద్యపరీక్షలతో అనారోగ్యాల బారిన పడలేరన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ జ్యోతి, వైద్యులు కల్పన, సతీష్, రాజయ్య, దామోదర్‌రెడ్డి, దేవిక, తదితరులు పాల్గొన్నారు.


