నామినేషన్ కేంద్రాల పరిశీలన
వేలేరు: మండలంలోని మల్లికుదుర్ల, వేలేరు క్లస్టర్ పంచాయితీల్లో రెండో విడత నామినేషన్ల స్వీకరణను అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను, పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధర్మసాగర్‌లో జిల్లా పరిశీలకుడు..
ధర్మసాగర్: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను మంగళవారం హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు పరిశీలించారు. ఈసందర్భంగా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి, పెద్ద పెండ్యాల క్లస్టర్ల పరిధి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ధర్మసాగర్ ఎంపీడీఓ అనిల్ కుమార్, అధికారులు ఆయన వెంట ఉన్నారు.


