
సరిపడా యూరియా నిల్వలు
నెక్కొండ: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, పలు ఎరువులు, విత్తన దుకాణాలను ఆమె మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. పంటల దశలను బట్టి మండలాలకు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. రైతులు పంటలకు మొత్తం ఒకేసారి యూరియాను తీసుకెళ్లకుండా అవసరం ఉంటేనే తీసుకెళ్లాని చెప్పారు. అవసరానికి మించి తీసుకెళ్లడంతో యూరియ కొరత ఏర్పడనుందన్నారు. అధిక యూరియా వాడకంతో పంటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతాయి ఆమె వివరించారు. నానో యూరియా, నానో డీఏపీని పంటల మీద పిచికారీ చేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరారు. వ్యాపారులు యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే షాపులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ