
సుమారు 30 అక్రమ నిర్మాణాలు..
తాళ్ల చెరువు అలుగు వెడల్పు 50 నుంచి 60 అడుగులుగా అధికారులు నిర్ధారించారు. కాగా గతంలో రియల్ మాయ, కబ్జాదారుల మాటలు విని పక్కా స్థలాలు అనుకొని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదలున్నారు. అయితే ప్రస్తుతం అలుగులో 30 పక్కా భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని పాక్షికంగా, మరికొన్ని సగభాగం, ఇంకొన్ని పూర్తిగా కోల్పోయే భవనాలున్నాయని ప్రచారం సాగింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో అలుగులో నిర్మాణాలు చేపట్టిన వారికి పుర అధికారులు నోటీసులు జారీచేసి మిన్నకుండిపోవడం గమనార్హం. అలాగే ఆత్మకూర్‌లోని పరమేశ్వస్వామి చెరువు పరిసర ప్రాంతాలు కూడా కబ్జాకు గురికావడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయాయి.