
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్‌గల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి మోసం చేసే ఫర్టిలైజర్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, మాందాపూర్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏఓ రాజవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణం వద్ద ఎరువుల ధరల వివరాలు నమోదు చేయాలని, దుకాణంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. అనంతరం దుకాణాలల్లో రికార్డులు, ఈ–పాసు యంత్రాలను పరిశీలించారు.
యూరియా వాడకం తగ్గించాలి
వానాకాలం సాగులో యూరియా వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించినట్లు డీఓ గోవింద్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరయ్యారు. విత్తనాలు, ఎరువులు ఎంపికలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని కోరారు. మల్లాయిపల్లి, దొండాయిపల్లి రైతువేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా గ్రామాల ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఈఓ అఖిల తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
గోవింద్‌నాయక్