
పొగతో సావాసం
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో పారబోసి తగులబెట్టడంతో పొగతో బాధపడుతున్నాం. డంపింగ్ యార్డుకు తీసుకెళ్లమని చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.
– శేఖర్, పెబ్బేరు
రెండు రోజులకోసారి..
కొత్తకోట మున్సిపాలిటీలో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకెళ్లిన చెత్తను శివారులో తగులబెడుతున్నారు. దీంతో దు ర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం.
– లాల్‌కోట రవి, కొత్తకోట
రూ.25 లక్షలు వెచ్చించినా..
చెత్తను ప్రాసెస్ చేయడం కంటే తగులబెట్టడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.25 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించినా ఉపయోగం లేదు. ప్రయాణికులతో పాటు సెగ్రిగేషన్ షెడ్డు సమీపంలోని కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్న వారందరూ పొగను పీల్చుకోలేక రోగాల బారిన పడుతున్నారు. – చంటి, అమరచింత
నిర్వహణపై ప్రత్యేక దృష్టి
పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను నిత్యం డంపింగ్ యార్డుకు తరలించి, వాటి నుంచి ప్లాస్టిక్, ఇనుప వస్తువులను వేరు చేస్తున్నాం. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆదాయం సమకూర్చి, మున్సిపల్ అభివృద్ధికి వినియోగిస్తున్నాం. – శశిధర్, మున్సిపల్ కమిషనర్ ఆత్మకూర్
●

పొగతో సావాసం

పొగతో సావాసం