
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుదారులకు వినతులపై తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 87 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 14 వినతులు..
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 14 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనంతరం సంబంధిత ఠాణాల ఎస్‌ఐ, సీఐలకు ఫోన్ చేసి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. 8 భూ తగాదాలు, 4 కుటుంబ ఘర్షణలు, రెండు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి