
డ్రెయినేజీలు నిర్మించడం లేదు..
మా కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా నేటికీ స్పందించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీరంతా రహదారులపై పారుతోంది. పారిశుద్ధ్య కార్మికులు కూడా రాకపోవడంతో మేమే తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
– చెన్నయ్య, రాంనగర్‌కాలనీ
దుర్వాసన భరించలేకపోతున్నాం..
మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక మురుగంతా ఖాళీ ప్రదేశాల్లో నిలుస్తోంది. దోమలు, పందుల బెడదతో సతమతం అవుతున్నాం. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
– సంపూర్ణ, కాలనీవాసి, 11వ వార్డు
భయంగా బతుకుతున్నాం..
మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మరుగు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో విషపు పురుగుల సంచారం పెరిగింది. దీంతో భయం భయంగా బతుకుతున్నాం. పిచ్చి మొక్కల తొలగింపునకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
– నిరంజన్‌పాషా, కొత్తకోట రోడ్
●

డ్రెయినేజీలు నిర్మించడం లేదు..

డ్రెయినేజీలు నిర్మించడం లేదు..