
చినుకు రాలక.. చింత తీరక..
తిర్మలాయపల్లి శివారులో వాడుముఖం పట్టిన మొక్కజొన్న
రోహిణి కార్తెలో ముందస్తుగా వర్షాలు కురవడంతో పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసిన అన్నదాతలు పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం వంటి మెట్ట పంటలు సాగు చేశారు. తర్వాత చినుకు రాలక పంటలు మొలక దశలోనే వాడుముఖం పడుతున్నాయి.
20 రోజులుగా మబ్బులు, ఈదురుగాలులు మినహా వాన చినుకు రాలడం లేదు. దీంతో రైతు చేసేది లేక రోజు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ
అధికారుల లెక్కల ప్రకారం మండలంలో పత్తి 960 ఎకరాలు, జొన్న 370 ఎకరాలు, మొక్కజొన్న 430 ఎకరాలు, ఆముదం 50 ఎకరాలు మొత్తం 1,810 ఎకరాల మెట్ట
పంటలు సాగైనట్లు తెలుస్తోంది. మొలకలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు
ఆందోళనకు గురవుతున్నారు. – ఖిల్లాఘనపురం

చినుకు రాలక.. చింత తీరక..

చినుకు రాలక.. చింత తీరక..