
మెనూ విధిగా పాటించాలి
గోపాల్‌పేట: వసతిగృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందుబాటులో ఉండి మెనూ పాటించేలా చూసుకోవా లని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తినేముందు ప్లేట్లు, చేతులు కడుక్కునేందుకు నీరు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు. బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వార్డెన్ రమేష్‌గౌడ్ ఉన్నారు.