
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన కురుమూర్తిస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌లోని 9 డిపోల నుంచి శని, ఆది, సోమవారాల్లో 175 ప్రత్యేక బస్సులు నడపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాల రోజు ఆదివారం ఆయా డిపోల నుంచి 110 బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ శ్రీదేవి కోరారు.