
ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం:
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూల్‌బాగ్‌లోని జగన్నాథ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. శాసనమండలి విపక్షనేత బొత్ససత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుల ఆధ్వర్యంలో సాగే సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనపై చర్చించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, ఎంఎస్‌ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.