
● వర్షంలోనూ కొనసాగిన ఆందోళన
జిందాల్ నిర్వాసితులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బొడ్డవరలో బుధవారం ఆందోళన కొనసాగించారు. భూములకు పూర్తిస్థాయి పరిహారం అందజేయాలని, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి, జీవనాధారం లేక, పరిహారం అందక రోడ్డున పడి రోదిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షం వహించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రెడ్‌కార్పెట్ వేయడం తగదన్నారు. జిల్లా కలెక్టర్, జిందాల్ కలెక్టర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐదు పంచాయతీలకు చెందిన నిర్వాసితులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ పాల్గొన్నారు. – ఎస్.కోట