
రాజీయే ఉత్తమ మార్గం
విజయనగరం క్రైమ్:
రాజీయే రాజమార్గమని, జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ సిబ్బంది చొరవచూపాలని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ, ఆస్తి, క్రిమినల్, ట్రాఫిక్ కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా కక్షిదారులను ప్రోత్సహించాలన్నారు. కేసుల రాజీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయడంలో సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు.
● లోక్ అదాలత్‌లలో కేసుల
పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● పోలీస్
సిబ్బందికి
ఎస్పీ పిలుపు