
డాక్టర్ దీనకుమార్‌కు సత్కారం
సీతానగరం: పార్వతీపురం బదిలీ అయిన పశుసంవర్థక ఎ.డి డాక్టర్ సీహెచ్ దీనకుమార్‌ను పశువైద్య సహాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు. దీర్ఘకాలంగా మండల పశువైద్యాధికారి, సీతానగరం పశువైద్య శాఖసబ్ డివిజినల్ ఎ.డిగా డాక్టర్ దీనకుమార్ సేవలందించిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు కావడంతో పార్వతీపురం సబ్‌డివిజన్ ఎ.డి గా బదిలీ అయినందున పశువైద్య సహాయకులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సన్మాన గ్రహీత డాక్టర్ దీనకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు అనివార్యమే అయినా విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. సుదీర్ఘకాలం మండలంలో పశువులకు సేవలందించే సదవకాశం తనకు దక్కిందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు. ,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు.