
వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం విజయవంతం చేద్దాం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ముఖ్యనాయకులతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 5న శనివారం మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రంలో గల రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబులు హాజరవుతారని తెలియజేశారు. పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనాయకులు హాజరు కానున్నారన్నారు.
అందరూ హాజరుకావాలి
ఈ సమావేశానికి పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాలు, పురపాలక సంఘం నుంచి పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొంగు చిట్టిరాజు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బంకురు రవికుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తప్పెట ప్రసాద్, అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పీఎస్‌ఆర్ నాయుడు, ఎంపీటీసీలు బడే రామారావు, వై.రమణ, సర్పంచ్‌లు తీళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు