
వైద్య కళాశాలకు చంపావతి నది నీరు
–8లో
భగ్గుమన్న జిందాల్ నిర్వాసితులు
జిందాల్‌కు భూములిచ్చి నష్టపోయిన రైతాంగానికి మేలు చేయకుండా తిరిగి నిర్వాసితులను బెదిరించడం కలెక్టర్‌కు తగదని ఏపీ రైతు సంఘం నాయకులు అన్నారు.
విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలకు మొయిద వద్ద చంపావతి నదిలో రూ.12 కోట్లతో ప్రతిపాదించిన తాగునీటి సరఫరా పథకం నిర్మాణ పనులను 10 రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకి 1 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేలా పథకం పనులు పూర్తిచేయాలన్నారు. మరో ఏడాది తరువాత వైద్య కళాశాల లో పీజీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందన్నారు. ప్రస్తుతం కళాశాలలోని ఆరు బోరు బావుల్లో నీరు పునరుద్ధరణ అయ్యేందుకు వీలుగా నీటి సేకరణ కట్టడాలను, నీటిని నిల్వ కోసం సంప్ ట్యాంకును వారం రోజుల్లో నిర్మించాలన్నారు. కళాశాలకు తాత్కాలికంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. జేఎన్‌టీ యూ కూడలి నుంచి వైద్యకళాశాల వరకు వీధిదీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సి పాల్ కె.పద్మలీల, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీపీఓ మల్లికార్జునరావు, భూగర్భ జలశాఖ డీడీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
అనాథ పిల్లల జాబితా పునఃపరిశీలించాలి
మిషన్ వాత్సల్య పథకం కింద అనాథ పిల్లలకు అందిస్తున్న ఆర్థిక సహాయం కోసం వచ్చిన 22 దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్, హెచ్‌ఐవీ ప్రభావిత, అనాథ పిల్లలు 388 మందికి నెలకు రూ.4వేలు అందజేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో డీసీపీయూ లక్ష్మి, బి.రామకోటి పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్