
● మూత‘బడి’ంది!
కూటమి ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనం నిర్ణయంతో సంతకవిటి మండలం చిత్తారపురం పంచాయతీ గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల మూతపడింది. దశాబ్దాలుగా 1 నుంచి 5 తరగతుల పిల్లలకు విద్యను బోధించే ప్రాథమిక పాఠశాలను ఇటీవల 1, 2 తరగతులు మాత్రమే బోధించే ఫౌండేషన్ స్కూల్‌గా ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రాథమిక పాఠశాలగానే ఉంచాలని ఆందోళనలు చేశారు. అయినా, నిర్ణయం మారకపోవడంతో గ్రామస్తులు తమ పిల్లలను 1, 2 తరగతులు ఇక్కడ చదివించి 3, 4, 5 తరగతులను బయట గ్రామాల్లో చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామంలో 1వ తరగతి చదివే వయసున్న విద్యార్థులున్నా ఎప్పుడైనా 3, 4, 5 తరగతులు బయట చదివించాల్సిందేనన్న ఉద్దేశంతో 1, 2 తరగతులు పిల్లలను కూడా ఇక్కడ చేర్పించడం మానేశారు. విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ నిన్నటివరకు పనిచేసిన టీచర్ ఎస్.నారాయణమ్మను డిప్యుటేషన్‌పై ఎస్.అగ్రహారం ప్రాథమిక పాఠశాలకు వేశారు. చివరకు ఫౌండేషన్ పాఠశాల మూతపడింది. – సంతకవిటి