
విజయవంతం చేయండి
మెరకముడిదాం: విజయనగరం జగన్నాథ్ ఫంక్షన్ హాల్‌లో వచ్చేనెల 3న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ జిల్లా విస్థృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ ముఖ్యనాయకులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి మండలం నుంచి అధికమంది తరలిరావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్‌కుమార్, గుర్ల మండలానికి చెందిన నాయకులు పొట్నూరు సన్యాసినాయుడు పాల్గొన్నారు.