
రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
బొబ్బిలి: పట్టణంలోని ఫ్‌లైఓవర్‌పై వెళ్తున్న లారీ, బైక్‌లు ఢీకొనడంతో (రెండూ ఒకే వైపు)మండలంలోని శివడవలసకు చెందిన గణేష్ అనే యువకుడి కాలు నుజ్జు నుజ్జయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ముందు చక్రం కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలో చాలా సేపు ఉండిపోయాడు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్షతగాత్రుడ్ని ట్రాఫిక్ ఎస్‌ఐ పి.జ్ఞానప్రసాద్ సిబ్బంది జ్ఞానప్రసాద్ సిబ్బంది, ఇతరుల సాయంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.