
● ఒక విద్యార్థిని.. ఒక టీచర్
చిత్రం చూశారా.. ఒకే ఒక్క బాలికకు పాఠ్యాంశాలు బోధిస్తున్నది దత్తిరాజేరు మండలం చినవంగర గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సత్యమూర్తి. ఆ పాఠశాలలో గతేడాది లెన్సీ అనే ఒకేఒక్క చిన్నారి చేరింది. ఆ బాలికకే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేస్తూవచ్చారు. ఈ ఏడాది కూడా రెండో తరగతికి వచ్చిన ఆ చిన్నారికి చదువు చెబుతున్నారు. కొత్తగా ఒకటో తరగతిలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా
చేరలేదని ఉపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థులు బడిలో చేరితే చక్కని బోధన అందిస్తానని చెప్పారు. – దత్తిరాజేరు