
కలెక్టరేట్‌ను ముట్టడించిన వీఆర్‌ఏలు
విజయనగరం గంటస్తంభం: వేతనాలు పెంచాలని, పే స్కేల్, డీఏ వర్తింపజేయాలంటూ గ్రామ రెవె న్యూ సహాయకులు (వీఆర్‌ఏ) విజయనగరం కలెక్టరేట్‌ను బుధవారం ముట్టడించారు. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేశారు. అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవ ర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా అదనపు పనిభా రం మోపడాన్ని తప్పుబట్టారు. కేవలం నెలకు రూ. 11వేలు వేతనంతో ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతు లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర అమలుచేస్తున్న పే స్కేల్‌ను వర్తింపజేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరా వు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.