
తరచూ అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ
● ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమలరాణి
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాలను తరచుగా పర్యవేక్షించాలని సీడీపీఓలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విమలరాణి సూచించా రు. విజయనగరం ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల సేవలు సంపూర్ణంగా అందేలా చూడాలన్నారు. మాద క ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పె రిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రథమ కోఆర్డినేటర్ రమణ పాల్గొన్నారు.
సమగ్ర విపత్తు నిర్వహణ
ప్రణాళికలు రూపొందించాలి
● విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ
సంయుక్త సలహాదారు ఎస్.ప్రకాష్
విజయనగరం అర్బన్: జిల్లాలో ఎదురయ్యే విపత్తులపై సన్నద్ధమయ్యేలా ప్రతిశాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర విపత్తుల శాఖకు పంపాలని విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సంయుక్త సలహాదారు ఎస్.ప్రకాష్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విపత్తుల నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే విపత్తుల నుంచి గట్టెక్కడం సాధ్య మన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్ టైం హెచ్చరికల వ్యవస్థలో సచేచేత్ యాప్ కీలకమని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో విపత్తుల శాఖ కార్యదర్శి అభిషేక్ బిస్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియ, డీఆర్వో శ్రీనివాసమూర్తి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ సవరమ్మ, డీపీఎం రాజేశ్వరి, సీపీఓ పి.బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
కొత్త మరువాడలో
ఏనుగుల గుంపు
● భయాందోళనలో రైతులు, ప్రజలు
వంగర: మండలంలోని కొత్త మరువాడ గ్రామ పంటపొలాల్లోకి మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏనుగుల గుంపు చేరింది. ప్రస్తుతం గ్రామ సమీపంలోని బోడికొండ వద్ద సంచరిస్తున్నాయి. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, ఏనుగులను కవ్వించవద్దని అటవీశాఖ సిబ్బందితో పాటు వీఆర్‌ఓ ఈశ్వరరావు, వీఆర్ ఏ భూలోక గ్రామస్తులను అప్రమత్తం చేశారు. సీతాదేవిపురం, కింజంగి గ్రామాల వైపు ఏనుగులు వెళ్లే అవకాశం ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేశారు.

తరచూ అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ

తరచూ అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ