
చిత్తశుద్ధితో పనిచేయండి
● కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: అధికారులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. జూన్ 25తో కలెక్టర్‌గా బాధ్య తలు తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా జేసీ సేతు మాధవన్, జిల్లా అధికారులు, రెవెన్యూ సంఘం సభ్యులు, పలువురు పాత్రికేయులు కలెక్టర్‌ను కలిసి అభినందించారు. డీఆర్‌ఓ ఆధ్వర్యంలో జిల్లా రెవిన్యూ అసోసియేషన్ సభ్యులు, జిల్లా అధికారులు కలెక్టర్‌తో కేక్ కట్ చేసి దుశ్శాలువలు కప్పి అధినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు సాధించాలి
గ్రామీణస్థాయిలో పరిశుభ్రతకు అందించనున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025 అవార్డుకు ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలు పోటీపడేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025పై వెబెక్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 37 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దామని, కేంద్ర బృందం వస్తున్న వేళ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నా రు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.