విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను చెల్లించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు
కొత్తవలస: విశాఖపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 విభాగంలో బాలికల వన్‌డే ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీల్లో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10,8 తరగతులు చదువుతున్న అక్కాచెల్లెళ్లు రాణిస్తున్నట్లు పాఠశాల హెచ్‌ఎం సీహెచ్.ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. పుష్పలతగౌడ్ (10 వతరగతి) అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించినట్లు తెలిపారు.
అలాగే చెల్లి హర్షిత గౌడ్ (8వ తరగతి)తో కలిసి 240 పరుగుల భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. పుష్పలతగౌడ్ 144 బాల్స్‌కు గాను 27 ఫోర్స్, 5 సిక్స్‌లతో మొత్తం 215 పరుగులు సాధించిందన్నారు. అలాగే హర్షితగౌడ్ 109లు పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆ అక్కాచెల్లెళ్లను పాఠశాల ఉపాధ్యాయులు గోవిందనాయుడు, గిరి తదితరులు అభినందించారు.

క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు

పుష్పాలంకరణలో పైడితల్లి