
క్రైం కార్నర్
రామాలయంలో చోరీ
జామి: మండల కేంద్రంలోని చుక్కవారి వీధిలో గల రామాలయంలో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అర్చకుడు వి. సాయి ఎప్పటిమాదిరిగా పూజా కార్యక్రమాలు ముగించుకుని ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. మధ్యాహ్న సమయంలో ఆలయంలో ఎవ్వరూ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులు తొలగించి, హుండీ తాళాలను పగులగొట్టి నగదు అహహరించుకుపోయారు. హుండీలో సుమారు 15 వేల రూపాయల వరకు ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని కాశిందొరవలస పంచాయతీ మోసూరువలస గిరిజన గ్రామానికి చెందిన మోసూరు భాస్కరరావు (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భాస్కరరావు రామభద్రపురం మండలం జోగిందొరవలస గ్రామ సమీపంలో పనులు ముగించుకుని శనివారం రాత్రి తిరిగి వస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి ఒక కుమారుడు ఉండగా.. భార్య ధనలక్ష్మి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గోపాలు, తవుడమ్మలు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి మిస్సింగ్
డెంకాడ: మండలంలోని ఆకులపేట గ్రామానికి చెందిన నిడిగట్టు జేజమ్మ(65) కనిపించకపోవడంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ. సన్యాసినాయుడు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన తెల్లవారుజాము 4 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన జేజమ్మ తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నీలిరంగు చీర, ఎరుపు రంగు జాకెట్ వేసుకుందని తెలిపారు. మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎవరికై నా కనబడితే 91211 09446, 91548 74492 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్