
తారకరామా... ఎన్నాళ్లీ డ్రామా..!
● రెండు దశాబ్దాలుగా నత్తతో పోటీ
● విమానాశ్రయం, సాగుకు నీరెప్పుడు?
● వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి
హయాంలోనే ప్రాజెక్టు పనుల్లో కదలిక
● భోగాపురం ఎయిర్‌పోర్టుకు
నీరందించాలంటే ప్రాజెక్టు
పూర్తికావాల్సిందే..
● పనులకు పూర్తిస్థాయిలో నిధులు
విదల్చని కూటమి ప్రభుత్వం
విజయనగరం గంటస్తంభం:
తారకరామ తీర్థసాగరం.. రెండు దశాబ్దాలుగా సాగుతోన్న ప్రాజెక్టు. 2005 ఫిబ్రవరి 19న ప్రారంభించిన ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచనా వ్యయం పెరుగుతుందే తప్ప పనిమాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబునాయుడు ఏ నాడు ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను రూ.150.24 కోట్ల తో పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆయా గ్రామాలకు 0.162 టీఎంసీలు తాగునీటి సరఫరాకు అవకాశం కుదురుతుంది. విజయనగరం కార్పొరేషన్‌కు 0.48 టీఎంసీల తాగునీరు సరఫరా చేయొచ్చు.
భూసేకరణే అసలు సమస్య
తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3497.58 ఎకరాల భూమికిగాను 3278.32 ఎకరాలను సేకరించారు. మిగతా 219.26 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కుమిలి రిజర్వాయర్ ప్రాజెక్టులో కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం తాజాగా కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది. తాడిపల్లి, కుడిపి, నీలంరాజు పేట గ్రామాల నిర్వాసితులకు పరిహారానికి రూ.75.69 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్ కు తాగునీరు సర ఫరాకు అవకాశం కుదురుతుంది.
నెల్లిమర్ల సమీపంలో చంపావతి
ప్రగతి ఇదీ (శాతం)

తారకరామా... ఎన్నాళ్లీ డ్రామా..!