
రేపు జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, విశాఖపట్నంలో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.