
కల సాకారం
బొంరాస్‌పేట: మండల వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి బొంరాస్‌పేటవాసులు కలలుగంటున్న జూనియర్ కళాశాల ఏర్పాటు సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో సాకారమైంది. ఇప్పటివరకు మండలంలోని విద్యార్థులు ఇంటర్ విద్యకు పొరుగు పట్టణాలకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ఉన్న కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాలకు ఇంటర్మీడియెట్ కోసం వెళ్లక తప్పలేదు. కానీ ఈ ఏడాది మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఎల్‌టీ (మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్), ఎంపీహెచ్‌డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) గ్రూపులను అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వసతుల కల్పన
మండల కేంద్రం శివారులో తుంకిమెట్ల బ్రిడ్జి వద్ద ప్రస్తుతం జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలోని అదనపు తరగతి గదుల్లో జూనియర్ కళాశాల కొనసాగుతోంది. జెడ్పీహెచ్‌ఎస్ అదనపు గదుల సముదాయంలో జీయూపీఎస్ అదనపు గదుల భవనంలో ఇంటర్ విద్యార్థులకు బోధన జరుగుతోంది. భవిష్యత్తులో నూతన భవన నిర్మాణానికి ప్రభ్తుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
సిద్ధంగా అధ్యాపక బృందం
కళాశాల అధ్యాపకులుగా ఆంగ్లం, కామర్స్ రెగ్యులర్ లెక్చర్‌లున్నారు. కెమెస్ట్రీ, బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, మ్యాథ్స్, సివిక్స్, ఎకనామిక్స్, హిందీ సబ్జెక్టులకు అతిథి అధ్యాపకులున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్య అంతగా లేకపోవడంతో నిరుడు పరిగిలోనే నిర్వహించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ, ప్రథమ సంవత్సరాల విద్యార్థులతో కళాశాల నిర్వహణ జరుగుతోంది. జూనియర్ కళాశాల ప్రవేశాల గడువు ఈనెల చివరి వరకు ఉంటుందని ఇంటర్ బోర్డు ఆదేశాలున్నాయి. ఇప్పటివరకు ఈ విద్యాసంవత్సరంలో 123 మంది విద్యార్థులున్నారు.
మండల కేంద్రంలో జూనియర్ కళాశాల నిర్వహణ
ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
జూనియర్ కళాశాల వివరాలు
గ్రూపు ఫస్టియర్ సెకండియర్
ఎంపీసీ 13 0
బైపీసీ 40 3
సీఈసీ 19 1
హెచ్‌ఈసీ 4 4
ఎంఎల్‌టీ 15 లేదు
ఎంపీహెచ్‌డబ్ల్యూ 24 లేదు
మొత్తం విద్యార్థుల సంఖ్య 123

కల సాకారం