
బాధితులకు న్యాయం చేస్తాం
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయే వారికి న్యా యం చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పట్టణంలోని జాతర స్థలాన్ని సందర్శించారు. ఇండ్లు కోల్పోతున్న వారి కోసం జాతర స్థలంలో వెంచర్ చేస్తున్నారు. ఆ వెంచర్‌లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి స్థలాలను కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. విశాలమైన రోడ్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాండూరు సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత పాటించాలి
పరిగి: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడం తోపాటు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం పరిగి పట్టణంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పనుల వేగంపెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి
అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ మున్సి పల్ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ, బుడగ జంగం కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్