
ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి
తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్త సేకరణ, తరలింపు తదితర పనుల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. తరచూ జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడుతుంటారని తెలిపారు. కార్మికులు ఎలాంటి అనారోగ్యం పాలైనా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సిబ్బందితో పాటు, కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమేష్ కుమార్, మెప్మా టీఎంసీ రాజేందర్, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విరబూసిన బ్రహ్మ కమలాలు
తాండూరు టౌన్: పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూసాయి. ఏడాదికి ఒక్కసారి పూలు పూసే ఆ చెట్టుకు శుక్రవారం ఏకంగా ఏడు కమలాలు పూశాయి. పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన వ్యాపారి పునీత్ కుమార్ ఇంట్లో ఈ అరుదైన విషయం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు చెట్టు వద్ద పూజలు చేశారు. ఒకేసారి ఏడు పుష్పాలు పూయడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు.
నేడు బీఎల్‌ఓలకు శిక్షణ
ధారూరు: మండలంలోని బూత్ లెవల్ ఆఫీసర్లకు శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాస్టర్స్ ట్రైన ర్స్ బీఎల్‌ఓలకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మండలంలోని బీఎల్‌ఓలు సకాలంలో హాజరు కావాలనీ ఆయన సూచించారు.
జాతీయ రక్షణ నిధికి
రూ.3లక్షల విరాళం
తాండూరు/యాలాల: జాతీయ రక్షణ నిధికి ఆర్‌బీఓఎల్ తరఫున రూ.3 లక్షల విరాళం అందజేసినట్లు కంపెనీ సీఈఓ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖకు తమ కంపెనీ తరఫున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతినెలా జాతీయ రక్షణ నిధికి తమ వంతు సాయం అందజేస్తామని ఆయన తెలిపారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
బొంరాస్‌పేట: చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. బొంరాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్, ప్రిన్సి పాల్ విజయ్‌కుమార్, ఎంఈఓ హరిలాల్, నాయ కులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, అధ్యాపకులు దినేశ్, సురేశ్, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.

ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి

ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి

ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి